NEWS
కుమార్తె పుట్టినరోజు వేళ.. ఆలయ పునర్నిర్మాణానికి విరాళం

- శ్రీరామ మందిర పునర్నిర్మాణానికి రూ. 21,000 విరాళం
- తన తండ్రి జ్ఞాపకార్థం అందజేసిన యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కావలి సంతోష్ కుమార్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణం ఇందిరా నగర్లోని ఏకైక శ్రీరామ మందిర పునర్నిర్మాణానికి కావలి కుటుంబం తమ ఉదారతను చాటుకుంది. తాండూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కావలి సంతోష్ కుమార్, తన కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకుని, తన తండ్రి స్వర్గీయ కావలి మొగులయ్య జ్ఞాపకార్థం రూ. 21,000 నగదును విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతగా ఆలయ పునర్నిర్మాణానికి తమ వంతు సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఇందిరా నగర్ వాసుల చిరకాల కోరికైన రామ మందిర నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు సంతోష్ కుమార్ను అభినందిస్తూ, ఆయన కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు.



