కుక్కల రాజ్యంలో” తాండూరు….!

- డే అండ్ నైట్ డ్యూటీ లో కుక్కలు
- ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు అంటున్న శూనకాలు
- పిల్లల, వృద్దుల, యువకుల ఎవరైనా ఓకే
- బైటికి వస్తే ఖతం… కాటు తప్పదా..?
- రాజ్యామెళుతున్న గ్రామ సింహాలు
తాండూరు జనవాహిని ప్రతినిధి : “కుక్క కాటుకి చెప్పు దెబ్బ” అనే సామెత ఇకపై చెల్లదు! ఎందుకంటే తాండూరు పట్టణంలో ఇప్పుడు “పూటకో కుక్క కాటు… పరాచకమా” అన్నట్టు పరిస్థితి తయారైంది. వీధి కుక్కల బెడద మామూలుగా లేదు, అవి ఇప్పుడు పట్టణంలో తమదే రాజ్యం అన్నంత రేంజ్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.
స్థానికులు ఏం మాట్లాడుకుంటున్నారంటే… కుక్క కాటు “రోగుల రిజిస్ట్రేషన్” కౌంటర్! ఆసుపత్రిలో వేరే రోగులు ఉన్నారో లేదో కానీ, కుక్క కాటు బాధితుల సంఖ్య మాత్రం రోజురోజుకీ “రికార్డు బ్రేకింగ్” చేస్తోందట!
వీధి కుక్కల టైమింగ్: పగలు-రాత్రి తేడా లేదు! ఇంతకుముందు కుక్కలు రాత్రిపూట మాత్రమే తిరిగేవి, ఇప్పుడు ఆఫీసు వేళల్లో, అల్లరి చిల్లరగా ఆడుకునే పిల్లల మీదా దాడి చేస్తున్నాయంటే వాటి ధైర్యం మామూలు ధైర్యం కాదు! వీటి వీరంగం చూసి, నైట్ షిఫ్ట్ చేసేవారు కూడా పగటి పూట దడిసిపోతున్నారట!
మున్సిపల్ అధికారుల “నైతిక మద్దతు”: కుక్కల నివారణ చర్యలకు మున్సిపల్ అధికారులు ఎందుకో “సోషల్ డిస్టెన్స్” పాటిస్తున్నారు. వాళ్ళ ఆఫీసు గేటు బయట కుక్కలు హారన్ కొట్టినా స్పందించడం లేదంటే, కుక్కలకి-అధికారులకి మధ్య ఏదో “సైలెంట్ అగ్రిమెంట్” నడుస్తోందనే అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి. బహుశా, ఆ కుక్కలకు మున్సిపల్ గేటు దాటి లోపలికి రావడానికి కూడా ధైర్యం లేదు కాబట్టే అధికారులు దూరుతున్నారేమో!
తాండూరులో ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే: “ఇంట్లోంచి అడుగు బయటపెడితే, పక్క వీధిలో మన కోసం ఒక ‘పల్సర్ బైక్’ లాగా, వీధి కుక్క ఒకటి కాచుకుని కూర్చుంటుంది. దాని చూపులోనే ‘ఈ పూట నీ వంతు’ అనే భావం కనిపిస్తోంది!” అని ఓ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.



