కాంగ్రెస్ వద్దు, బిఆర్ఎస్ ముద్దు…!

- తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై మాజీ సర్పంచ్ ఆనందలక్ష్మి తీవ్ర ఆరోపణలు!
- బిఆర్ఎస్ కే ప్రజల మద్దతు
- పార్టీ లో చేరిన కాంగ్రెస్ నాయకులు
- రోహిత్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు, గాజీపూర్ మాజీ సర్పంచ్ ఆనందలక్ష్మీ సహా పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పచ్చని గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని, “మీరు మీరు కొట్లాడుకోండి, గెలిచినవాడు నావాడు” అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారని ఆనందలక్ష్మీ తీవ్రంగా ఆరోపించారు.
ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీలో విలువ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికలే తాండూరు ఎమ్మెల్యే ఓటమికి మెట్లు అవుతాయని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప, కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు.
ఆనందలక్ష్మీ ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే, ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సాయిలు గౌడ్, మాజీ ఎంపీటీసీ తిపన్న, రసూల్, లక్ష్మయ్య, హసేన్, శంకరప్ప మరియు పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి బీఆర్ఎస్ యువ నాయకుడు పైలెట్ రోహిత్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు రమేష్, మాజీ సర్పంచ్ వీరన్న, తలారి సుశీల, ముస్తఫా, వెంకటయ్య, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.



