- 28వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మేడి విజయభాస్కర్
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆశీస్సులతో బరిలోకి
- ఆర్బిఎల్ అధినేత శ్రీనివాస్ రెడ్డి మద్దతుతో పోటీకి సిద్ధం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల హడావిడి నెలకొంది. 28వ వార్డ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేడి విజయభాస్కర్ బరిలో ఉంటారని ప్రకటన చేశారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్బిఎల్ అధినేత శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో ఆయన ఎన్నికల క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారని తెలిపారు.మేడి విజయభాస్కర్ మొదటి నుండి వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన సేవా గుణాన్ని, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, వార్డు బాధ్యతలను ఆయనకు అప్పగించారని భాస్కర్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డిలు అవకాశం ఇస్తే తప్పకుండా బరిలో ఉంటానని వెల్లడించారు. వార్డులో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సహకారంతో 28వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.






