Thursday, April 2, 2026

ఇంటింటికీ సంక్షేమ పథకాలు …!

-

  • రేపు తాండూర్ నియోజకవర్గంలో ‘ప్రజా పాలన’
  • అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి: పట్లోళ్ల సందీప్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగిటకే చేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన’ రేపు నిర్వహించబడుతుందని కాంగ్రెస్ యువ నాయకులు పట్లోళ్ల సందీప్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఈ పాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో తాండూర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ వల్లనే పరిపాలన నేరుగా ప్రజల వద్దకు వస్తుందని, పేదలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన అజెండా అని సందీప్ రెడ్డి స్పష్టం చేశారు.వివిధ సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి, దరఖాస్తు చేసుకోలేని వారు రేపు నిర్వహించే ఈ కార్యక్రమంలో తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై ప్రజలకున్న నమ్మకం, వారి ఆశీస్సులు శ్రీరామరక్ష అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Related Stories