- రామ మందిరానికి ఎంపీ నిధులతో తీరిన నీటి కష్టం
- ఇందిరానగర్‌లో బోరు బావిని ప్రారంభించిన బీజేపీ నాయకులు
- ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఆలయ కమిటీ కృతజ్ఞతలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ లో వెలసిన శ్రీ రామ మందిర పునర్నిర్మాణం సందర్భంగా… భక్తుల నీటి అవసరాలను తీర్చేందుకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఎంపీ నిధుల నుండి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు బావిని గురువారం ఆలయ కమిటీ మరియు స్థానిక బీజేపీ నాయకులు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం మరియు ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక నిలయాల అభివృద్ధికి ఎంపీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలతో పాటు, భక్తులకు మంచినీటి సమస్య తలెత్తకుండా ఈ బోరు బావి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. సామాన్య ప్రజల విన్నపాలకు సానుకూలంగా స్పందించి, వెంటనే నిధులు విడుదల చేసినందుకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, కృష్ణ ముదిరాజ్, దోమ కృష్ణ, సంగమేశ్వర్, బండారి శ్రీకాంత్, శివాజీ, అర్చన ప్రవీణ్, ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక భక్తులు పాల్గొన్నారు.






