
- 36వ వార్డు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న అంతారం సంతోష్ ముదిరాజ్
- అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
జనవాహిని ప్రతినిధి తాండూరు : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 36వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అంతారం సంతోష్ ముదిరాజ్ ఆసక్తి చూపుతున్నారు. గత పది ఏళ్లుగా వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న ఆయన, ఈసారి ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయించి తనకు అవకాశం కల్పిస్తే, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. దశాబ్ద కాలంగా ప్రజలతో ఉన్న అనుబంధం తనను గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.పార్టీ పెద్దలు కొంత చొరవ చూపి 36 వ వార్డ్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ కి ఎల్లప్పుడూ అండదండగ ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.



