Saturday, March 28, 2026

అధికార హోదా కాదు.. సామాన్యుడి సేవ..!

-

spot_img
spot_img
spot_img
  • అధికారం అంటే ఉద్యోగుల పట్ల మమకారం అని నిరూపించిన నీరజ బాల్ రెడ్డి.
  • మున్సిపల్ కార్మికులతో భోజనం చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, తాండూరు నూతన ఛైర్పర్సన్ నీరజ బాల్‌రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాజకీయాల్లో మార్పు అంటే కుర్చీలు మారడం కాదు, అలవాట్లు మారడం అని తాండూరు మున్సిపల్ నూతన ఛైర్పర్సన్ నీరజ బాల్‌రెడ్డి నిరూపించారు. సోమవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టిన తీరు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే మున్సిపల్ కార్యాలయంలోని శ్రమజీవులైన కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఈ అపూర్వ ఘట్టానికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సాక్షిగా నిలిచారు. ఛైర్పర్సన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఎమ్మెల్యే కూడా కార్మికుల మధ్య కూర్చుని భోజనం చేయడం విశేషం. ఏ స్థాయిలో ఉన్నా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికులే మున్సిపాలిటీకి ప్రాణవాయువు అని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే చేసిన మొదటి పని కార్మికుల కష్టాలను పంచుకోవడం.మున్సిపల్ ఛైర్పర్సన్ హోదాలో ఉన్నా, ఎటువంటి భేషజాలు లేకుండా కార్మికులతో కలిసి భోజనం చేయడం అక్కడి వారందరినీ ఆకట్టుకుంది.పట్టణ అభివృద్ధిలో కార్మికుల పాత్రను గౌరవించడం ద్వారా తన పాలన ప్రజల కోసం ఉంటుందని నీరజ స్పష్టం చేశారు.తాండూరును ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో ప్రతి కార్మికుడి సహాయ సహకారాలు కావాలన్నారు. ఈ వినూత్న కార్యక్రమంతో తాండూరు రాజకీయాల్లో కొత్త జోష్ నెలకొంది. సామాన్యుడికి చేరువగా వెళ్తున్న నీరజ బాల్‌రెడ్డి నాయకత్వంపై పట్టణ ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories