సోలార్, కంప్యూటర్, ఇంగ్లీష్ కోర్సుల్లో శిక్షణ..!
పీపుల్ ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత సోలార్, కంప్యూటర్ శిక్షణ

- తాండూరులో ‘పీపుల్ ట్రీ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభం
- ముఖ్య అతిథిగా హాజరై శిక్షణను ప్రారంభించిన ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం డిగ్రీలతో సరిపెట్టుకోకుండా, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తాండూరు శాసనసభ్యులు బి. మనోహర్ రెడ్డి అన్నారు. పీపుల్ ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను ఆయన బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలోని యువతకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నైపుణ్యాలను నేర్చుకునే ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. యువతకు తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
శిక్షణ వివరాలు….పీపుల్ ట్రీ ఫౌండేషన్ (స్కిల్ ఇండియా) ఆధ్వర్యంలో 18 నుండి 35 ఏళ్ల లోపు ఉన్న యువతీ యువకులకు ఈ క్రింది విభాగాల్లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది…సోలార్ టెక్నీషియన్కం,ప్యూటర్ శిక్షణ,ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సప్న పరిమళ్ తాండూర్ పట్టణ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాల తదితరులు పాల్గొన్నారు.ఫౌండేషన్ తరపున వికారాబాద్ జిల్లా ఇన్చార్జ్ పద్మనాభ రెడ్డి, సెంటర్ డైరెక్టర్ అన్నపూర్ణ, ఫీల్డ్ ఆఫీసర్ నాగరాజు, ఆఫీస్ ఇన్చార్జ్ భవాని తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.జనవరి 1న మొదటి బ్యాచ్ ప్రారంభమైందని, ఆసక్తి గల నిరుద్యోగ యువత త్వరలోనే ప్రారంభం కానున్న తదుపరి బ్యాచ్‌లలో చేరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పద్మనాభ రెడ్డి కోరారు.




