క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాలు..!

- రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. గోపాలం
- తాండూరులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఖేలో ఇండియా షూటింగ్ బాల్ ఎంపికలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్. ఐలయ్య ఆదేశాల మేరకు, వికారాబాద్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు తాండూరు పట్టణంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఖేలో ఇండియా ఉమెన్స్ షూటింగ్ బాల్ ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి.జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రాములు పర్యవేక్షణలో ఎం.జే.పి. బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఎంపికలకు రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి. గోపాలం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, ఉపాధ్యక్షుడు అంజి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి బి. గోపాలం మాట్లాడుతూ.. బాలికలు, మహిళలు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపితే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు లభించి, బంగారు భవిష్యత్తు పొందవచ్చని సూచించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని, ఆయన క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రాములును అతిథులు అభినందించారు.ఈ జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను షార్ట్‌లిస్ట్ చేసి, ఈ నెల 13, 14 తేదీలలో తాండూరులోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లో జరిగే రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా ఉమెన్స్ షూటింగ్ బాల్ పోటీలకు పంపుతామని నిర్వాహకులు తెలిపారు.క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన 25 మంది బాలికలకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. గోపాలం మెడల్స్ అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహణ కార్యదర్శి రాములు, వివిధ పాఠశాలల పిడి, పిఇటిలు, సుమారు వంద మంది బాలికలు, మహిళా క్రీడాకారిణులు పాల్గొన్నారు.



