- డ్రగ్స్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యేపై వేటు వేయాలి
- బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయ్యాలి
- కాంగ్రెస్ యువ నేత జోగుల ఎబినేజర్ డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జోగుల ఎబినేజర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఆ పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ విన్నపం చేశారు.రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని ఒక ఆహ్వానించదగ్గ పరిణామంగా పేర్కొన్న ఎబినైజర్, కేవలం నోటీసులతో సరిపెట్టడం సరికాదని విమర్శించారు. పార్టీ క్రమశిక్షణను, నైతిక విలువలను కాపాడటంలో రాజీ పడకుండా, ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అని ఆయన కోరారు.తాండూరు నియోజకవర్గ యువత తరపున విన్నపం చేస్తున్నట్లు తెలిపిన ఆయన, తెలంగాణ భవిష్యత్తు కోసం మరియు రాజకీయాల్లో నైతికతను కాపాడటం కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్ట ముఖ్యం అనుకుంటే ఆరోపణలు ఉన్న వారిపై వెనుకాడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.



