Friday, April 3, 2026

విజయం బంటు వేణుదే,ప్రగతి కాంగ్రెస్‌దే..!

-

  • 11వ వార్డులో ‘బంటు వేణు’ ప్రభంజనం!
  • దద్దరిల్లిన తాండూరు మున్సిపాలిటీ.. జనసంద్రమైన వీధులు
  • ​ కాంగ్రెస్‌ ప్రచార హోరుతో ప్రత్యర్థుల్లో వణుకు
  • ​హస్తం హావ.. వేణు మార్క్ రాజకీయానికి జనం జైజేలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బంటు వేణు చేపట్టిన ప్రచార హోరు ఒక సునామీలా సాగుతోంది. గురువారం వార్డులో నిర్వహించిన భారీ ర్యాలీతో తాండూరు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, కార్యకర్తల నినాదాలతో 11వ వార్డు ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.సాధారణ ప్రచారానికి భిన్నంగా బంటు వేణు తనదైన శైలిలో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇంటింటికీ వెళ్తూ ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ, వార్డు సమస్యలపై స్పష్టమైన హామీలు ఇస్తుండటంతో ఓటర్ల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని వేణుకు బ్రహ్మరథం పట్టారు.వేణు ప్రచారానికి వస్తున్న స్పందన చూసి తాండూరు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యర్థి వర్గాలు సైతం వేణు ఊపును చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఈసారి 11వ వార్డులో హస్తం జెండా ఎగరడం ఖాయం అనే చర్చ పట్టణమంతటా జోరుగా సాగుతోంది.ఈ సందర్భంగా బంటు వేణు మాట్లాడుతూ.. వార్డు ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు మరువలేనివని, గెలిచిన వెంటనే 11వ వార్డును అభివృద్ధిలో నంబర్ వన్‌గా నిలుపుతానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు, వార్డు అభివృద్ధి ప్రణాళికలే తనను గెలిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Related Stories