
- అనారోగ్యంతో ఉన్న పేదలకు ప్రభుత్వం అండ.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
- రూ. 39.56 లక్షల విలువైన సహాయం అందజేత
- తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : నిరుపేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని, ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలా మారుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 39,56,000/-విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పేదలు వివిధ అనారోగ్య సమస్యలతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. త్వరితగతిన స్పందించి 88 మందికి భారీ మొత్తంలో ఆర్థిక సాయం మంజూరు చేయించామని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.అనారోగ్యంతో ఆర్థికంగా కుంగిపోయిన తమను ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే ఆదుకోవడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



