
- బీసీల హక్కుల పోరాట యోధుడు సయ్యద్ శుకూర్ ఎన్నికల బరిలోకి!
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి సయ్యద్ శుకూర్ తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాలుగా తాండూరు నుంచి ఢిల్లీ వరకు బీసీల సమస్యలపై అనేక పోరాటాలు చేశానని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో కేవలం 13 ఓట్ల తేడాతో విజయం చేజారినప్పటికీ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం వార్డు ప్రజల అభీష్టం మేరకు మళ్ళీ పోటీ చేస్తున్నానని, బీసీ సంఘాలు, ప్రజా సంఘాల అండ తనకు పుష్కలంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.బీసీ హక్కుల కోసం, బహుజన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తపించే వ్యక్తినని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం కృషి చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి తన గెలుపుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు.



