రైలు ప్రయాణం భారమే..!

- రేపటి నుంచే పెరగనున్న చార్జీల!
- రైల్వే శాఖ కీలక నిర్ణయం.
- దూరపు ప్రయాణాలకు అదనపు బాదుడు!
జనవాహిని డెస్క్ : సామాన్యుడి రవాణా సాధనం రైలు ప్రయాణం రేపటి నుంచి ఖరీదు కానుంది. పెరుగుతున్న నిర్వహణ భారంతో రైల్వే శాఖ ప్రయాణ చార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తక్కువ దూరం ప్రయాణించే వారికి ఊరటనిస్తూ, 215 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు పెంపు నుంచి మినహాయింపు ఇచ్చింది.దూరానికి తగ్గట్టుగా వడ్డింపు..ప్రయాణించే దూరం పెరిగే కొద్దీ చార్జీల భారం కూడా పెరగనుంది.
- 215 కి.మీ. వరకు: ఎలాంటి పెంపు లేదు (మినహాయింపు).
- 216 – 750 కి.మీ.: ₹5 అదనం.
- 751 – 1250 కి.మీ.: ₹10 అదనం.
- 1251 – 1750 కి.మీ.: ₹15 అదనం.
- 1751 – 2250 కి.మీ.: ₹20 అదనం.
ఏ క్లాస్ కు ఎంత పెంపు? కేవలం దూరమే కాకుండా, ప్రయాణించే బోగీ రకాన్ని బట్టి ప్రతి కిలోమీటరుకు అదనపు చార్జీలను వసూలు చేయనున్నారు. ఆర్డినరీ స్లీపర్, ఫస్ట్ క్లాస్: కి.మీ కు 1 పైసా పెంపు. సెకండ్ క్లాస్ & ఎక్స్‌ప్రెస్ స్లీపర్: కి.మీ కు 2 పైసలు పెంపు.ఏసీ ప్రయాణికులకు: ఏసీ చైర్ కార్ నుంచి ఫస్ట్ క్లాస్ ఏసీ వరకు అన్నింటికీ కిలోమీటరుకు 2 పైసల చొప్పున అదనం.ఈ ధరల మార్పు రేపటి నుంచి అమల్లోకి రానుండటంతో, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను తదనుగుణంగా సిద్ధం చేసుకోవాలని రైల్వే వర్గాలు సూచించాయి.





