రైలుకు అంటుకున్నా మంటలు…!

- హైదరాబాద్ – బెళగవి రైలులో అగ్నిప్రమాదం
- శంకర్ పల్లి వద్ద రైలులో అగ్నిప్రమాదం
- చక్రాల వద్ద చెలరేగిన మంటలు
- తీవ్ర భయాందోళనలో ప్రయాణికులు
- తక్షణమే స్పందించిన రైల్వే సిబ్బంది
జనవాహిని ప్రతినిధి తాండూరు : హైదరాబాద్ నుండి కర్ణాటకలోని బెళగవికి వెళ్తున్న వారంతపు ప్రత్యేక రైలులో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. రైలు చక్రాల వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వారానికి ఒకసారి నడిచే హైదరాబాద్ – బెళగవి ఎక్స్ప్రెస్ రైలు గురువారం సాయంత్రం బయలుదేరింది. రాత్రి 7:30 గంటల సమయంలో వికారాబాద్ జిల్లా శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే, రైలు చక్రాల భాగం నుండి భారీగా మంటలు, పొగలు రావడం గమనించారు.మంటలను గమనించిన వెంటనే లోకో పైలట్ రైలును నిలిపివేశారు. రైల్వే సిబ్బంది మరియు సాంకేతిక నిపుణులు తక్షణమే స్పందించి మంటలను అదుపు చేశారు. బ్రేక్ బైండింగ్ (చక్రాలకు బ్రేకులు పట్టేయడం) కారణంగా ఘర్షణ ఏర్పడి ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 30 నిముషాల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. తనిఖీల అనంతరం రైలును తిరిగి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.




