చెస్ ఛాంపియన్గా సెంట్ మేరీస్…!
- చెస్ తాండూరు ఛాంపియన్‌గా సెంట్ మేరీస్ విద్యార్థి ప్రాజోత్
- ముఖ్య అతిథి సరళా రెడ్డి ఆర్ బి వో ఎల్ ఎండి చేతుల మీదుగా బహుమతి ప్రధానం
జనవాహిని ప్రతినిధి తాండూరు : హిందూ ధార్మిక్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘చెస్ తాండూరు-2025’ పోటీల్లో తాండూరు పట్టణంలోని సెంట్ మేరీస్ హైస్కూల్ విద్యార్థి ప్రాజోత్ అద్భుత ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌గా నిలిచాడు.హిందూ ధార్మిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో దాదాపు 31 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న అండర్-16 విభాగంలో ప్రాజోత్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు.
ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బివోఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సరళా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన ప్రాజోత్ కు ఆమె బహుమతిని అందజేసి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు ఇలాంటి క్రీడల్లో పాల్గొనడం వల్ల మేధస్సు పెరుగుతుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.సెంట్ మేరీస్ పాఠశాల విద్యార్థి ప్రాజోత్ ఈ ఘనత సాధించడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ జసింత బస్కో, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ప్రాజోత్ పట్టుదల, ఏకాగ్రత వల్లే ఈ విజయం సాధ్యమైందని, భవిష్యత్తులో అతను మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.



