- శ్రీ రామ మందిర పునర్నిర్మాణానికి విరాళం
- దాతలు సహకరించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి.
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఇందిరా నగర్లో వెలసిన ఏకైక శ్రీ రామ మందిర పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణం కోసం భక్తులు, దాతలు తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ఉదారత చాటుకుంటున్నారు. ఆలయ నిర్మాణానికి మద్దతుగా శనివారం పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. పట్టణానికి చెందిన జనార్దన్ రెడ్డి రూ. 51,000/-, అలాగే రొంపల్లి సంతోష్ రూ. 25,000/- నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతకు నిలయమైన ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు.దాతలకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి ఆలయ పునర్నిర్మాణానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.



