NEWS
ఓటేసిన పైలెట్…!

- ఇందర్చేడ్ లో రోహిత్ రెడ్డి ఓటు వినియోగం
- ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన నేతలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నేడు జరిగిన పోలింగ్లో బషీరాబాద్ మండలంలో ఇందర్ చెడ్ గ్రామంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, రాష్ట్ర మీడియా ప్రతినిధి శ్రీశైల్ రెడ్డి మరియు మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకోవడం ద్వారానే స్థానిక పాలన బలోపేతం అవుతుందని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉత్సాహంగా ఓటు వేశారు.



