Saturday, February 28, 2026

మేము చదువుకోవాలి కరెంట్ వేయ్యండి..!

-

spot_img
  • కరెంటు కోతలతో సెల్ ఫోన్ వెలుతురులోనే చదువులు.. 
  • విద్యార్థుల విలవిల!
  • బుక్కులు ఉన్నాయి.. కానీ వెలుతురు లేదు! ఈ అన్యాయం ఎవరిది?
  • పరీక్షల టెన్షన్.. కరెంటు కోతల ఫ్రస్ట్రేషన్

జనవాహిని ప్రతినిధి తాండూరు : ఇంటర్మీడియట్ పరీక్షల కీలక సమయంలో విద్యుత్ శాఖ తీరు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. గంటల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందిగా ఉంది అంటూ విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు.పరీక్షలకు ముందు రోజు రివిజన్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. కానీ తాండూరు పట్టణంలో అనూహ్యంగా విధిస్తున్న విద్యుత్ కోతలు విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. కరెంటు లేకపోవడంతో చాలామంది విద్యార్థులు సెల్ ఫోన్ టార్చ్ లైట్లు, కొవ్వొత్తుల వెలుతురులో చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.సోమవారం పరీక్ష పెట్టుకుని ఇలా చీకట్లో కూర్చోవడం వల్ల ఏం చదువుతున్నామో అర్థం కావడం లేదు, తలనొప్పి వస్తోంది” అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాల్సిన కనీస బాధ్యత అధికారులకు లేదా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గంటల తరబడి కరెంటు తీసేసి విద్యార్థులను ప్రెస్టేషన్‌లోకి నెట్టడం ఎంతవరకు సమంజసమని వారు మండిపడుతున్నారు.పిల్లలు ఇప్పటికే పరీక్షల భయంతో ఉన్నారు. ఇప్పుడు ఈ చీకటి వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. చదువుకోవడానికి కనీస వసతి లేకపోతే వారు పరీక్షలు ఎలా రాస్తారు? అని – స్థానిక తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని తాండూరు ప్రజలు గట్టిగా కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories