- తాండూరు మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
- మొత్తం 36 వార్డులకు జాబితా విడుదల
- బీసీ (జనరల్) కేటగిరీకి మున్సిపల్ చైర్మన్ పీఠం
- మహిళలకు దక్కిన ప్రాధాన్యత
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాబోయే 2026 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాండూరు మున్సిపాలిటీకి సంబంధించిన వార్డుల వారీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. అధికారులు అధికారికంగా రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. మొత్తం 36 వార్డులకు గానూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ విభాగాల్లో కేటాయింపులు జరిగాయి. ఈసారి మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ జనరల్ అభ్యర్థికి కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రిజర్వేషన్ ల వివరాలు… ఎస్సీ, ఎస్టీ కేటాయింపులు: వార్డు 19ను ఎస్సీ జనరల్‌కు, వార్డు 2ను ఎస్సీ మహిళకు కేటాయించారు. అలాగే వార్డు 13ను ఎస్టీ కేటగిరీకి కేటాయించారు. బీసీ రిజర్వేషన్లు: మొత్తం 15 వార్డులు బీసీలకు దక్కాయి. ఇందులో వార్డులు 7, 8, 10, 11, 12, 21, 29, 31 జనరల్‌కు కేటాయించగా.. 3, 5, 9, 17, 26, 27, 34 వార్డులను బీసీ మహిళలకు కేటాయించారు. జనరల్ కేటగిరీ: మొత్తం 18 వార్డులు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. వీటిలో సగానికి పైగా (10 వార్డులు) మహిళలకే దక్కడం విశేషం. 1, 4, 14, 16, 20, 25, 30, 32, 35, 36 వార్డులు జనరల్ మహిళలకు కేటాయించగా, మిగిలిన 8 వార్డులు (6, 15, 18, 22, 23, 24, 28, 33) జనరల్ అభ్యర్థులకు కేటాయించారు.మున్సిపల్ చైర్మన్ పదవి బీసీలకు దక్కడంతో ఆ వర్గానికి చెందిన ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రిజర్వేషన్ల ప్రకటనతో అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి.






