
- అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
- మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సవాల్!
- హీట్ పుట్టిస్తున్న ఎమ్మెల్యే వ్యాఖ్యలు…
జనవాహిని ప్రతినిధి తాండూరు : గత ఐదేళ్ల కాలంలో తాండూరు నియోజకవర్గాన్ని దోపిడీలకు, కబ్జాలకు కేంద్రంగా మార్చిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి, ప్రస్తుత అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ముందా అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిలదీశారు. బుధవారం తాండూరులో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు.
గత ప్రభుత్వ హయాంలో ఉత్తుత్తి ప్రెసిడెంట్లు చూపిస్తూ అభివృద్ధి కొరకు వందల కోట్లు తెచ్చానని, మాటల వరకే సరిపెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే అని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రెడ్డి కేవలం దౌర్జన్యాలు, భూ కబ్జాలకే ప్రాధాన్యత ఇచ్చారని మనోహర్ రెడ్డి విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఐదేళ్ల పాలనలో తాండూరు ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చెప్పాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వ హయాంలో చేసిన కొన్ని పనుల బిల్లులు కాంట్రాక్టర్లకు రాకపోవడంతో హాట్స్టార్ వచ్చి మృతి చెందాడని, పెండింగ్లో ఉన్న బిల్లులు మొత్తం మా ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. దాదాపు 40 నుండి 50 కోట్ల వరకు ఉన్న బిల్లులు ఇవ్వకుండా, గత ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. ఉత్తుత్తి మాటలు, ఉత్పత్తి పసిడింగు చూపించి తాండూరు నియోజకవర్గ ప్రజలను మభ్య పెట్టారన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తాండూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రెండేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి పనులపై తాము ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.తాండూరు అభివృద్ధిపై మీకు చిత్తశుద్ధి ఉంటే, మేము చేసిన పనులపై చర్చకు రావాలి. దమ్ముంటే సమయం, సందర్భం చెప్పండి.. నేను సిద్ధం” అని రోహిత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.ప్రజా సంక్షేమమే మా లక్ష్యంప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, త్వరలోనే తాండూరును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మనోహర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన అవినీతిపై ప్రజలకు అన్నీ తెలుసని, అందుకే వారిని తగిన రీతిలో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన వాక్యాలు ప్రస్తుతం తాండూర్ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తుంది.



