Friday, April 3, 2026

మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా..!

-

  • 13వ వార్డులో ‘గులాబీ’ రెపరెప..
  • సురేష్ నాయక్ ప్రచారానికి బ్రహ్మరథం!
  • గులాబీ మాయంగా 13వ వార్డ్ 
  • జోరందుకున్న బిఆర్ఎస్ ప్రచారం 

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల వేళ 13వ వార్డులో రాజకీయ హడావిడి జోరందుకుంది. బిఆర్ఎస్ అభ్యర్థి సురేష్ నాయక్ చేపట్టిన ఎన్నికల ప్రచారం వార్డులో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం వార్డులో నిర్వహించిన ప్రచారం లో ఆద్యంతం గులాబీ మయంగా సాగింది.​కారు ప్రచారానికి భారీ మద్దతు…గడప గడపకూ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరిస్తున్న సురేష్ నాయక్ కు 13వ వార్డు సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా వార్డుకు చెందిన యువత ఇతర పార్టీలను వీడి బిఆర్ఎస్ లో చేరడం విశేషం. వారికి సురేష్ నాయక్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. యువత చేరికతో వార్డులో కారు జోరు మరింత పుంజుకుంది.ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ.. వార్డు ప్రజల ఆశీస్సులు తనపై మెండుగా ఉన్నాయని, గెలుపు కారుదే అని ధీమా వ్యక్తం చేశారు. వార్డు అభివృద్ధి కోసం తాను నిరంతరం శ్రమిస్తానని, ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న బిఆర్ఎస్ గాలిలో తాండూరు మున్సిపల్ పీఠం గులాబీ వశం కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Related Stories