Saturday, April 4, 2026

మరో సారి ఎగిరేది బీజేపీ జెండానే..!

-

  • 1వ వార్డులో కమల దళం జోరు.. 
  • మాల్రెడ్డిపల్లిలో అభ్యర్థుల హవా!
  • బీజేపీకి బ్రహ్మరథం పట్టిన జనం.. 
  • అభివృద్ధికి పట్టం కడతామంటూ హామీ

జనవాహిని ప్రతినిధి తాండూరు : 1వ వార్డులో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతుండటంతో వార్డులో కమల వికాసం కనిపిస్తోంది. సోమవారం మాల్రెడ్డిపల్లిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో అభ్యర్థులు మహేశ్వరి, శివ శంకర్ లు పాల్గొని ఓటర్లతో మమేకమయ్యారు. బీజేపీ అభ్యర్థులకు మాల్రెడ్డిపల్లి వాసులు నీరాజనం పలికారు. ముఖ్యంగా మాల్రెడ్డిపల్లికి చెందిన వివిధ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటించడం విశేషం. తాము అధికారంలోకి వస్తే వార్డు రూపురేఖలు మారుస్తామని అభ్యర్థులు ఓటర్లకు భరోసా ఇచ్చారు.ప్రచార సభలో అభ్యర్థులు మాట్లాడుతూ ప్రధానాంశాలను నిధుల మళ్లింపు లేకుండా, వార్డు అభివృద్ధికి కేటాయించిన ప్రతి రూపాయిని సక్రమంగా ఖర్చు చేస్తామన్నారు.అభ్యర్థుల వెంట ఉన్న బీజేపీ శ్రేణులు వార్డులో గెలుపుపై ధీమా వ్యక్తం చేశాయి. మా అభ్యర్థుల చిత్తశుద్ధి, మోదీ నాయకత్వం మాకు శ్రీరామరక్ష అని కార్యకర్తలు పేర్కొన్నారు. ప్రచార హోరుతో 1వ వార్డు మొత్తం కాషాయమయమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, మహిళా సంఘాల సభ్యులు, మరియు యువజన విభాగం ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Related Stories