మణికంఠుని మహా పడిపూజ..!

- తాండూరు పట్టణం లో మహా పడి పూజ
- హనుమాన్ దేవాలయం లో నిర్వహణ
- అందరు పాల్గొనాలని బాల హనుమాన్ భజన మండలి విజ్ఞప్తి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణం హేరూర్ వార్డులోని కన్య పాఠశాల ఆవరణలో గల హనుమాన్ దేవాలయంలో ఆదివారం సాయంత్రం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. శ్రీ గురు మణికంఠ ఆశ్రమం కన్య స్వామి ఎల్. హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పూజా కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఆదివారం సాయంత్రం 6:30 గంటల నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, పల్లకి సేవ, మరియు అత్యంత భక్తిశ్రద్ధలతో పద్దెనిమిది మెట్ల పూజను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అల్పాహార వితరణ ఉంటుందని పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలోని అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని బాల హనుమాన్ భజన కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో కోరారు.






