Friday, March 27, 2026

మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన చైర్పర్సన్…!

-

spot_img
spot_img
spot_img
  • ఉచిత మజ్జిగ కేంద్రం’ ప్రారంభం..!
  • సామాన్యుల దాహార్తి తీర్చడం అభినందనీయం
  • మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రజల, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు అఖిల భారతీయ మార్వాడీ యువ మంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ కేంద్రాన్ని తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.పట్టణంలోని ప్రధాన కూడలి బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆమె సందర్శించి, రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో బాటసారులకు, సామాన్య ప్రజలకు చల్లని మజ్జిగను అందించడం గొప్ప సేవా కార్యక్రమమని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలతో సామాన్యులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని, మార్వాడీ యువ మంచ్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.పట్టణంలోని ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు వచ్చి, వేసవిలో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాలను, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories