- ప్రజలపై భారము పడనీయలేదు…!
- ముడి చమురు ధరల తగ్గింపుపై ప్రధాని మోదీ నిర్ణయం సాహసోపేతం
- మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాహూ శ్రీలత
జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా సామాన్య ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ కౌన్సిలర్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాహూ శ్రీలత కొనియాడారు. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, భారత్‌లో ప్రజలపై ఆ భారం పడకుండా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం బాధ్యతాయుత పాలనకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఆమె ఓ ప్రకటన విడుదల చేస్తూ…. అనేక దేశాల్లో పెరిగిన చమురు ధరల భారాన్ని నేరుగా ప్రజలపై మోపుతుంటే, భారత ప్రభుత్వం మాత్రం ద్రవ్యోల్బణం పెరగకుండా కీలక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ క్రమంలో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 13 రూపాయల నుండి 3 రూపాయలకు తగ్గించగా, డీజిల్‌పై ఉన్న 10 రూపాయల సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం గమనార్హమని వివరించారు.’ప్రజలే ప్రథమ ప్రాధాన్యం’ అనే నినాదంతో మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఈ తగ్గింపు వల్ల రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయాల్లో కూడా ప్రజల పక్షాన నిలబడటం ఒక్క భారత ప్రభుత్వానికే సాధ్యమైందని శ్రీలత స్పష్టం చేశారు.





