Wednesday, March 11, 2026
spot_img

బిఫామ్ అందుకున్న అనిల్ ఆర్మీ..!

-

spot_img
spot_img
  • 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్మీ అనిల్
  •  బి-ఫామ్ అందజేసిన పైలట్ రోహిత్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో తాండూరులో రాజకీయ సందడి నెలకొంది. పట్టణంలోని 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఆర్మీ అనిల్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మంగళవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన నివాసంలో అనిల్‌కు అధికారికంగా పార్టీ బి-ఫామ్ అందజేశారు.బి-ఫామ్ అందుకున్న అనంతరం ఆర్మీ అనిల్… తనపై నమ్మకంతో పోటీ చేసే అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించి, 6వ వార్డును అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుతానని ఆయన పేర్కొన్నారు. వార్డు ప్రజల ఆశీర్వాదం, ముఖ్యంగా యువకుల బలమైన మద్దతు నాకు ఉంది. తప్పకుండా గెలిచి తీరుతాననే ధీమా ఉంది” అని అనిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పాల్గొని అనిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories