Saturday, March 28, 2026

బిఆర్ఎస్ దుశ్శకునం తొలగిపోయింది…!

-

spot_img
spot_img
spot_img
  • కామదహనంతో ముగిసిన ‘గులాబీ’ శకం..
  • అహంకారం దహనం అయ్యింది.. అధికార దాహం మంటల్లో కాలింది.
  • తాండూరులో ప్రశాంత వెల్లి విరియబోతుంది.
  • యువ నాయకుడు జోగుల ఎబినైజర్ సంచలన ప్రకటన

జనవాహిని ప్రతినిధి తాండూరు : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమైన హోలీ పండుగ సాక్షిగా తాండూరు రాజకీయాల్లో పెను మార్పు సంభవించిందని యువ నాయకుడు జోగుల ఎబినైజర్ పేర్కొన్నారు. కామదహన కార్యక్రమంతో తాండూరులో బిఆర్ఎస్ పార్టీ కథ ముగిసిందని, ఆ పార్టీ దుశ్శకునం తొలగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.అహంకారం దహనం అయ్యింది.. అధికార దాహం మంటల్లో కాలింది..తాండూరులో ప్రశాంత వెల్లి విరియబోతుందన్నారు. తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీ నూతన బాధ్యతలు చేపట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎబినైజర్ మాట్లాడుతూ, గత పాలకుల హయాంలో తాండూరు అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. హోలీ పండుగ నాడు కామదహనంతో చెడును ఎలా తగులబెడతామో, అలాగే తాండూరులో బిఆర్ఎస్ అరాచక పాలన కూడా అంతమైందన్నారు. ఆ పార్టీ శకం ముగిసిందని చెప్పడానికి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడమే నిదర్శనం అని ఆయన అన్నారు.

తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి నీరజ బాల్రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో పట్టణంలో కొత్త ఉత్సాహం నెలకొందని ఆయన తెలిపారు.
ఈ మార్పు తాండూరు ప్రజల చిరకాల వాంఛ అని ఆయన అభివర్ణించారు.
కొత్త పాలన ఒక రంగుల హరివిల్లులా ప్రారంభమైందని, ఇకపై పట్టణంలో పారదర్శకమైన మరియు అభివృద్ధిదాయకమైన పాలన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
యువత మరియు సామాన్య ప్రజల మద్దతుతో తాండూరును ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని జోగుల ఎబినైజర్ స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ కథ ముగిసింది.. కొత్త పాలన మొదలైంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories