- పెట్రోల్ బంక్ ముందు ‘మున్సిపల్’ పహారా!
- ఆటోలు, ట్రాక్టర్లను బంక్ ముందు నిలిపి….వినూత్న రీతిలో నిరసన
- ఇకపై మర్యాదలు ఉండవు.. కేవలం యాక్షనే!”
- — మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఆస్తి పన్ను కట్టకుండా మొండికేస్తున్న వారికి మున్సిపల్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. “సార్.. పన్ను కట్టండి” అని నోటీసులు ఇచ్చే కాలం పోయింది.. ఇప్పుడు “బండి వచ్చిందీ.. బకాయి కట్టమంటోంది” అన్నట్టుగా సీన్ మారిపోయింది!హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఇలాహి ఫీలింగ్ స్టేషన్ దగ్గర నేడు హైడ్రామా చోటుచేసుకుంది. భారీగా పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిల వసూలు కోసం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.అయితే ఇదేదో సాదాసీదా తనిఖీ అనుకుంటే పొరపాటే..! వరుసగా మున్సిపల్ ఆటోలు, ట్రాక్టర్లను బంక్ ముందు నిలిపి..వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ..పన్ను కట్టండి.. నగరాన్ని రక్షించండి” అంటూ బాకీదారులకు సెగ పుట్టించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే గడువు ముగిసినందున, వెంటనే స్పందించని పక్షంలో సదరు ఆస్తులను సీజ్ చేస్తామని బాహాటంగానే హెచ్చరించారు.



