- తాండూరులో మళ్ళీ దొంగలు
- పెళ్లికి వెళ్లొచ్చేలోపు ఇల్లు గుల్ల!
- సాయిపూర్లో చోటుచేసుకున్న భారీ దొంగతనం
- తులం బంగారం, వెండి, 50 వేల నగదు అపహరణ
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని సాయిపూర్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. ప్రజలు శుభకార్యాలకు వెళ్లే సమయాన్ని ఆసరాగా చేసుకుని దొంగతనాలు చేస్తున్న ముఠా, తాజాగా సాయిపూర్కు చెందిన అంజిలయ్య ఇంట్లో చేతివాటం ప్రదర్శించింది.సాయిపూర్ నివాసి అంజిలయ్య గత వారం రోజులుగా తన కుటుంబంతో కలిసి ఒక వివాహ వేడుకకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దుండగులు, ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో భద్రపరిచిన కొంత బంగారం, కొంత వెండి ఆభరణాలతో పాటు రూ. 50 వేల నగదును ఎత్తుకెళ్లారు.పెళ్లి ముగించుకుని బుధవారం ఇంటికి చేరుకున్న అంజిలయ్య కుటుంబ సభ్యులు, ఇంటి తలుపులు తెరిచి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని నగదు, నగలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.






