
- తాండూర్లో బీసీ సర్పంచులకు ఘన సన్మానం
- 26 శాతం మంది బీసీలు గెలవడం చరిత్రత్మకం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన 67 మంది బీసీ సర్పంచులను ఘనంగా సన్మానించారు. బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ జి. మధుసూదన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కేవలం 20 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసి అదనంగా 26 శాతం మంది బీసీలు గెలవడం చారిత్రాత్మకమని కొనియాడారు. జిల్లాలోనే అత్యధికంగా తాండూర్ నియోజకవర్గం నుండి 67 మంది బీసీ సర్పంచులు విజయం సాధించడం గర్వకారణమని రాజ్ కుమార్ పేర్కొన్నారు.ముఖ్య అతిథి మధుసూదన్ రావు మాట్లాడుతూ, సర్పంచులు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన పెంచుకుని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. తాండూర్, యాలాల్, బషీరాబాద్, పెద్దెముల్ మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



