పెద్దేముల్లో ఎన్నికల ప్రశాంతతకు పటిష్ట చర్యలు..!

- 130 మంది బైండోవర్!
- ఎస్పీ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
- పెద్దేముల్ఎ స్ఐ శంకర్ వెల్లడి
జనవాహిని ప్రతినిధి తాండూరు : జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా కట్టుదిట్టమైన ఆదేశాల మేరకు, పెద్దేముల్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా మరియు శాంతిభద్రతలకు భంగం కలగకుండా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.ఈ భద్రతా ఏర్పాట్లలో భాగంగా, ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటివరకు మండలంలో మొత్తం 53 కేసులలో 130 మందిని బైండోవర్ చేయడం జరిగిందని పెద్దేముల్ ఎస్ఐ శంకర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే వరకు వీరు కఠిన నిఘాలో ఉంటారన్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శంకర్ హెచ్చరించారు. ఈ కట్టుదిట్టమైన చర్యల ద్వారా ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు.



