NEWS

శ్రీలక్ష్మికి ‘శ్రీనన్న’ అభినందనలు..!

రాజస్థాన్‌లో జరిగే జాతీయ పోటీల్లో సత్తా చాటాలి

  • జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్ష
  • కోచ్‌లు, క్రీడాకారిణిని అభినందించిన బిఎస్‌ఆర్

జనవాహిని ప్రతినిధి తాండూరు : అండర్-14 జాతీయ ఖో-ఖో పోటీలకు ఎంపికైన అక్షర పాఠశాల విద్యార్థిని శ్రీలక్ష్మి కులకర్ణికి తాండూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అండగా నిలిచారు. ఈ నెల 16 నుండి రాజస్థాన్‌లో జరగనున్న జాతీయ పోటీలకు ఆమె ఎంపికైన సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి శ్రీ లక్షి ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాండూరు బిడ్డ జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం మనందరికీ గర్వకారణమన్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. శిక్షణ అందించిన కోచ్‌లు రవీందర్ రెడ్డి, గోపాల్‌ల సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ కృష్ణ గౌడ్, ఉపాధ్యాయులు ప్రవీణ్, శ్రీకాంత్ కుల్కర్ని, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

You cannot copy content of this page

error: Content is protected !!