
- న్యాయం చేయాలని నీళ్ల ట్యాంక్ ఎక్కి యువకుడి నిరసన
- దౌర్జన్యం భరించలేక.. ట్యాంక్ ఎక్కిన యువకుడు
జనవాహిని ప్రతినిధి తాండూరు : గ్రామంలో తమ కుటుంబానికి అన్యాయం జరుగుతోందని, అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మోసిన్ అనే యువకుడు సోమవారం నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగాడు.పెద్దేముల్ లో మోసిన్ కుటుంబానికి చెందిన ఇంటి స్థలం విషయంలో గ్రామంలోని కొందరు వ్యక్తులతో వివాదం నడుస్తోంది. తన స్థలం గురించి ప్రశ్నిస్తే ఎదుటివారు దాడి చేస్తున్నారని, మనస్తాపం చెందిన మోసిన్ ఈ సాహసానికి పూనుకున్నాడు.విషయం తెలుసుకున్న పెద్దేముల్ ఎస్సై శంకర్ మరియు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని, అతడిని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. అయితే, తన సమస్య పరిష్కారం అయ్యే వరకు, తనకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చే వరకు కిందకు దిగేది లేదని యువకుడు మొండిబట్టి కూర్చున్నాడు. ఈ సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



