- తెలంగాణలో ‘పుర’ పోరుకు షెడ్యూల్ విడుదల
- ఫిబ్రవరి 11న పోలింగ్!
జనవాహిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మరియు పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. * నామినేషన్ల స్వీకరణ: జనవరి 28 నుండి జనవరి 30 వరకు.* నామినేషన్ల పరిశీలన: జనవరి 31.* ఉపసంహరణకు గడువు: ఫిబ్రవరి 3. * పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 11 (ఒకే విడతలో).* ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 13.ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే, తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన పార్టీలు తమ కౌన్సిలర్ అభ్యర్థులను ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంతో ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, పార్టీ బీ-ఫారమ్ ఎవరికి దక్కుతుందో తెలియక అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు. షెడ్యూల్ విడుదలైన తక్షణం నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరగనున్నాయి.ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతుండగా, ఓటర్లు తమ వార్డు ప్రతినిధులను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు.






