Tuesday, March 17, 2026

నీటి సమస్యకు చెక్ పెట్టిన దివీటి ఎల్లప్ప..!

-

spot_img
  • ఇంట్లో కూర్చోలేదు.. వీధిలోకి వచ్చారు
  • 15వ వార్డులో మారిన ‘నీటి’ రాత!
  • ​వార్డు అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కౌన్సిలర్ దివీటి ఎల్లప్ప

జనవాహిని ప్రతినిధి తాండూరు : చాలామంది గెలిచిన దాకా ప్రజల మధ్య ఉంటారు.. గెలిచాక గడప దాటరు. కానీ 15వ వార్డు కౌన్సిలర్ దివీటి ఎల్లప్ప శైలి మాత్రం వేరు. “నేను గెలిచింది ఇంట్లో కూర్చోవడానికి కాదు.. ప్రజల కష్టాలు తీర్చడానికే” అంటూ పదవి చేపట్టిన నాటి నుండి వార్డు బాట పట్టారు.వార్డులో గత కొంతకాలంగా వేధిస్తున్న నీటి ఎద్దడిపై ఎల్లప్ప ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ, స్వయంగా రంగంలోకి దిగి నీటి సమస్యకు పరిష్కారం చూపారు. దీంతో ఇన్నాళ్లూ నీళ్ల కోసం ఇబ్బంది పడ్డ వార్డు వాసుల మొహాల్లో చిరునవ్వులు విరిశాయి. కేవలం నీటి సమస్యే కాదు, వార్డు అభివృద్ధికి సంబంధించి పలు పనులకు ఆయన ఈరోజే శ్రీకారం చుట్టారు. వార్డును జిల్లాలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెడతాను అని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.కౌన్సిలర్ వెంట నడుస్తూ బాలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ సమస్యను తక్షణమే పరిష్కరించిన కౌన్సిలర్‌ను చూసి, మా నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories