Friday, March 27, 2026

నాన్న లేకపోవడమే ఈ బాధలు…! 

-

spot_img
spot_img
spot_img
  •  మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య 
  •  పని ఒత్తిడే కారణమా…? 
  •  నిజాలు బైట పెట్టిన మృతురాలి అక్క….! 
  • -మిగితా సమాచారం కింద వీడియో లో చూడండి అసలు ఎం జరిగిందో…! 

జనవాహిని ప్రతినిధి వికారాబాద్ : వికారాబాద్ పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో అందరితో కలివిడిగా ఉండే ఓ మహిళా కానిస్టేబుల్ మనస్తాపంతో తనువు చాలించారు. వికారాబాద్ పట్టణంలోని టౌన్ గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న దివ్య అనే కానిస్టేబుల్ శనివారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కన్నీటిపర్యంతం చేస్తోంది. మృతురాలు దివ్య ప్రస్తుతం ధరూర్ పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఆమె ఇంట్లో విగతజీవిగా పడి ఉండటం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రఘుకుమార్ ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు దివ్య రాసిన ఆఖరి లేఖ (సూసైడ్ నోట్) లభ్యమైంది. తండ్రి మరణం తర్వాత కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులే ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినట్లు లేఖ ద్వారా తెలుస్తోంది……నా చావుకు ఎవరూ కారణం కాదు. నాన్న మన మధ్య లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు వస్తున్నాయి” అని దివ్య ఆ లేఖలో పేర్కొన్నట్లు సీఐ వెల్లడించారు.తండ్రిని కోల్పోయిన వెలితిని భరించలేక, ఆ జ్ఞాపకాలతో ఏర్పడిన మానసిక సంఘర్షణ వల్లే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న దివ్య కుటుంబ సభ్యులు, సహచర పోలీసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాధ్యతాయుతమైన పోలీస్ వృత్తిలో ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన దివ్య ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం తోటి ఉద్యోగులను కలిచివేస్తోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories