
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తాండూరు 23వ వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దొరశెట్టి సత్యమూర్తి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరికీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే ఏడాది ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో తాండూరు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



