Friday, April 3, 2026

దేశ రక్షణ వీరుడికి ఘన సత్కారం..!

-

  • దేశ రక్షణ వీరుడికి ఘన స్వాగతం
  •  25 ఏళ్ల సైనిక సేవ ముగించుకున్న ఉరడి శ్రీనివాస్‌కు సత్కారం
  • సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి: ఆర్సీబిఎల్ఓ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : భారత సైన్యంలో 25 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించి, పదవీ విరమణ పొందిన లక్ష్మీనారాయణపూర్ గ్రామ ముద్దుబిడ్డ ఉరడి శ్రీనివాస్‌కు ఘన స్వాగతం లభించింది. శనివారం యాలాల మండల కేంద్రంలో ఆర్బిఎల్ఓ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆయనను కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి, కుటుంబాలకు దూరంగా ఉంటూ రక్షణ కల్పించే సైనికులే దేశానికి అసలైన హీరోలని కొనియాడారు. పావు శతాబ్ద కాలం పాటు భారత మాత సేవలో శ్రీనివాస్ గడపడం గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం, సరిహద్దుల్లో సైనికులు ఎదుర్కొనే సవాళ్లు, వాతావరణ పరిస్థితులు మరియు దేశ భద్రత కోసం వారు చేసే ప్రాణత్యాగాల గురించి శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు.దేశ సేవలో జీవితాన్ని అంకితం చేసిన సైనికులు సమాజానికి ఆదర్శం. వారి సేవలను ఎల్లప్పుడూ గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది” అని శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు మరియు నాయకులు పాల్గొని శ్రీనివాస్‌కు అభినందనలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Related Stories