- రూ. 2.81 కోట్ల నిధులు మంజూరు
- 16 రకాల అభివృద్ధి పనులకు ఎస్డిఎఫ్ నిధుల కేటాయింపు
- ఎమ్మెల్యే కృషితో నిధుల విడుదల: టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. స్థానిక ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి ప్రత్యేక కృషితో తాండూరు పట్టణం మరియు బషీరాబాద్ మండలాల్లోని పలు అభివృద్ధి పనుల కోసం రూ. 2 కోట్ల 81 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.మంజూరైన నిధులతో మొత్తం 16 పనులను చేపట్టనున్నారు. ఇందులో ప్రధానంగా ముదిరాజ్ మరియు కురుమ భవనాల నిర్మాణానికి చెరో రూ. 50 లక్షలు, బ్రాహ్మణ మరియు మూర్షద్ దర్గా దగ్గర మైనారిటీ భవనాలకు చెరో రూ. 25 లక్షలు కేటాయించారు. అలాగే విలియం మూన్ స్కూల్ ప్రహరీ గోడకు రూ. 25 లక్షలు, పాత ఈద్గా పాఠశాల భవనానికి రూ. 35 లక్షలు, ఫార్నేషన్ రోడ్లు పొలాలకు, మైల్వార్, ఎకమై రోడ్ల నిర్మాణానికి రూ. 20 లక్షల నిధులను వెచ్చించనున్నారు. వీటితో పాటు రేవణ సిద్ధేశ్వర మందిరం కు 7 లక్షలు, బషీరాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయ కాంపౌండ్ వాల్ 10 లక్షలు, ఈద్గాల అభివృద్ధి 70 లక్షలు, మరియు వైకుంఠధామాల మరమ్మతులకు మరియు తదితర నిధులు కేటాయించినట్లు పురుషోత్తం రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని ఆయన కొనియాడారు. మంజూరైన పనులకు త్వరలోనే టెండర్లు పూర్తి చేసి, పనులు వేగంగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ వివిధ కుల సంఘాల ప్రతినిధులు, మైనారిటీ నాయకులు మరియు భజన మండలి , అయ్యప్ప కమిటీ సభ్యులు, ఎకమై, మైల్వార్, రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.



