NEWS

స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి షురూ..!

  • తొలి దశలోనే తాండూరు నియోజకవర్గానికి పోలింగ్ 
  • నియోజకవర్గం లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.

తాండూరు జనవాహిని ప్రతినిధి : రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుమిదిని మంగళవారం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీనితో, ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం రాజుకుంది.స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు దశల్లో నిర్వహించనుంది. ఈ క్రమంలో, తాండూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించిన పోలింగ్ తొలి దశలోనే జరగనుంది.

బషీరాబాద్ మండలం: ఇక్కడ 39 గ్రామ పంచాయతీలు, 312 వార్డు మెంబర్ స్థానాలు ఉన్నాయి.

తాండూర్ మండలం: ఈ మండలంలో 33 గ్రామ పంచాయతీలు, 290 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

యాలాల్ మండలం: ఇక్కడ 39 గ్రామ పంచాయతీలు, 318 వార్డు మెంబర్ స్థానాలు పోటీలో ఉన్నాయి.

పెద్దముల్ మండలం: ఈ మండలంలో 38 గ్రామ పంచాయతీలు, 308 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.

ఈ విధంగా వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండలాల్లోని 149 గ్రామ పంచాయతీలకు, 1228 వార్డు మెంబర్ స్థానాలకు తొలి దశలోనే ఎన్నికలు జరుగనున్నాయి.గ్రామ ప్రథమ పౌరులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ నుంచి దరఖాస్తులను సమర్పించడం ప్రారంభించవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం, ఈ స్థానాలకు సంబంధించిన పోలింగ్, ఓట్ల లెక్కింపు వచ్చే నెల డిసెంబర్ 11న ఒకే రోజు జరుగుతాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

You cannot copy content of this page

error: Content is protected !!