
- రామ మందిర పునర్నిర్మాణానికి ₹21,116 విరాళం
- రిటైర్డ్ పి.ఇ.టి బర్ల నారాయణ ఉదారత
జమావాహిని ప్రతినిధి తాండూరు: పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో వెలసిన శ్రీ రామ మందిర పునర్నిర్మాణ పనులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కాలనీలోని ఏకైక రామ మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న నిర్మాణ పనుల్లో భాగంగా, ఆదివారం రిటైర్డ్ పి.ఇ.టి బర్ల నారాయణ తన వంతు సహాయంగా ₹21,000 నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతుని సేవలో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని, ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన భక్తి తత్వాన్ని మరియు ఉదారతను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఇందిరానగర్ రామ మందిర పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, భక్తులు, దాతలు తమ శక్తి మేరకు ఆర్థిక సాయం అందించి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. దాతల సహకారంతోనే ఆలయాన్ని త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని వారు పేర్కొన్నారు.



