జాతీయ వేదికపై సెంట్ మేరీస్ పూర్వ విద్యార్థిని..!

- జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు సాయి సుదీష్ణ ఎంపిక
- సెంట్ మేరీస్ పాఠశాల యాజమాన్యం ఘన సన్మానం
- హర్షం వ్యక్తం చేసిన పాఠశాల సిబ్బంది
- భారత జట్టులో ఆడాలని కోరిక, సుదీష్ణ
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణానికి చెందిన సాయి సుదీష్ణ శెట్టి జాతీయ స్థాయిలో ఎంపికైన సందర్బంగా పట్టణం లోని సెంట్ మేరీస్ పాఠశాల ఘనంగా సన్మానించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించే అండర్-19 బాలికల జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు సుదీష్ణ ఎంపికై సందర్బంగా పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని శివపురిలో జనవరి 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో సుదీష్ణ తెలంగాణ తరపున తన ప్రతిభను కనబరచనుందన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా, తాండూరులోని సెంట్ మేరీస్ పాఠశాల పూర్వ విద్యార్థిని అయిన సాయి సుదీష్ణను పాఠశాల యాజమాన్యం జసింత బస్కో, సిబ్బంది ఘనంగా సత్కరించారు. క్రమశిక్షణతో కూడిన చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ జాతీయ స్థాయికి ఎదగడం పాఠశాలకు గర్వకారణమని యాజమాన్యం ఈ సందర్భంగా కొనియాడింది. సుదీష్ణను శాలువాతో సత్కరించి, ఆమెకు జ్ఞాపికను అందజేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా… చిన్నప్పటి నుంచే క్రికెట్ పై ఎంతో మక్కువ చూపిన సుదీష్ణ, స్థానిక అకాడమీలో కఠిన శిక్షణ పొంది తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. శివపురిలో జరగబోయే ఈ పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసి, భవిష్యత్తులో టీమ్ ఇండియా తరపున ఆడి దేశానికి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని సుదీష్ణ ఆశాభావం వ్యక్తం చేసింది.సెంట్ మేరీస్ పాఠశాల యాజమాన్యం సుదీష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె జాతీయ స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది అభినవ్, ప్రశాంత్, సంగీత, వరప్రసాద్ తదితరులు, సుదీష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.





