
- రామ మందిర పునర్నిర్మాణానికి దాతల ఉదారత
జనవాహిని ప్రతినిధి తాండూరు : స్థానిక ఇందిరా నగర్లోని శ్రీ రామ మందిర పునర్నిర్మాణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ మహత్కార్యానికి పట్టణంలోని పలువురు దాతలు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉదారత చాటుకుంటున్నారు. శనివారం ఆలయ కమిటీ ప్రతినిధులను కలిసి పలువురు విరాళాలను అందజేశారు.పట్టణానికి చెందిన రామ్ మోహన్ రావు – ₹11,111/-నరసింహ – ₹11,000/-వికాశిత్ – ₹5,111/-డాక్టర్ జితేందర్ – ₹5,100/-శ్రీ రామ మెడికల్ – ₹2,100/- విరాళంగా అందజేశారు. ఆలయ పునర్నిర్మాణానికి సహకరిస్తున్న దాతలకు ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. స్వామివారి కృపతో నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తామని వారు పేర్కొన్నారు. అదేవిదంగా రాముని సేవలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిస్తూ… దాతలు ముందుకు రావాలని కమిటీ సభ్యులు కోరారు.



