- ఫిజియోథెరపీ విద్యార్థికి ‘ఆర్బిఓఎల్’ ఆర్థిక చేయూత
- రూ. 21,000 అందజేసిన మేనేజింగ్ డైరెక్టర్ బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో తమ వంతు సహాయం అందిస్తున్నట్లు ఆర్బిఓఎల్ మేనేజింగ్ డైరెక్టర్ బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బషీరాబాద్ మండలం బద్లాపూర్ గ్రామానికి చెందిన పాత్రికేయుడు విజయ్ కుమార్ కుమారుడు శరత్ చంద్ర ఇటీవల ఫిజియోథెరపీ (బి.పీ.టీ) కోర్సులో సీటు సాధించారు.అయితే, పైచదువులకు ఆర్థిక స్థోమత సరిపోక ఇబ్బంది పడుతున్నారని విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి తక్షణమే స్పందించారు. విద్యార్థి తండ్రి విజయ్ కుమార్ కు రూ. 21,000/- నగదును ఆర్థిక సాయంగా అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.ఈ సందర్భంగా …ప్రతిభ ఉన్న విద్యార్థులకు పేదరికం అడ్డుకాకూడదని, ఉన్నత లక్ష్యాలను సాధించాలనే పట్టుదల ఉన్న విద్యార్థులకు తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శరత్ చంద్ర చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తమకు అండగా నిలిచిన ఆర్బిఓఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కు విద్యార్థి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






