- వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యం..!
- కౌన్సిలర్ పటేల్ సుప్రీత కరుణాకర్
- మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యేకు విన్నపం
- సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై చర్చ
- గాంధీ చౌక్ వద్ద మూత్రశాలల ఏర్పాటుకు విజ్ఞప్తి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గం మొదటి సమావేశం సోమవారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నీరజబాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో 34వ వార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ పటేల్ సుప్రీత కరుణాకర్ పాల్గొని వార్డులోని పలు ప్రజా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డులో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, పాడైన బోర్ లను వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. అలాగే విద్యుత్ సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని విన్నవించారు. అర్హులైన వృద్ధులకు, వితంతువులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని, ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.ముఖ్యంగా పట్టణంలోని రద్దీ ప్రాంతమైన గాంధీ చౌక్ ఏరియాలో ప్రజల సౌకర్యార్థం నూతనంగా మూత్రశాలలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేను కోరారు. కౌన్సిలర్ విన్నపాలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, వార్డులోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.






