Wednesday, February 4, 2026
Home NEWS కిషన్ ప్రసాద్ మృతి పట్ల బుయ్యాన్ని శ్రీనివాస్ రెడ్డి సంతాపం

కిషన్ ప్రసాద్ మృతి పట్ల బుయ్యాన్ని శ్రీనివాస్ రెడ్డి సంతాపం

0
319
  • అజయ్ ప్రసాద్ కుటుంబానికి బుయ్యాన్ని పరామర్శ
  • కిషన్ ప్రసాద్ మృతి పట్ల బుయ్యాన్ని శ్రీనివాస్ రెడ్డి సంతాపం
  • చిత్రపటానికి నివాళి.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన బుయ్యాన్ని శ్రీనివాస్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజయ్ ప్రసాద్ తండ్రి కిషన్ ప్రసాద్ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబాన్ని ఆదివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆర్బిఎల్ ఓ సీఈఓ బుయ్యాన్ని శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. బషీరాబాద్‌లోని అజయ్ ప్రసాద్ నివాసానికి చేరుకున్న ఆయన, తొలుత స్వర్గీయ కిషన్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం అజయ్ ప్రసాద్‌ను, ఇతర కుటుంబ సభ్యులను శ్రీనివాస్ రెడ్డి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిషన్ ప్రసాద్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ పరామర్శించిన వారిలో శ్రీనివాస్ రెడ్డితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here