Saturday, January 31, 2026
Home NEWS కారు పార్టీ లో చేరికల జోష్..!

కారు పార్టీ లో చేరికల జోష్..!

0
392
  • తాండూరులో కాంగ్రెస్‌కు ‘హస్త’వియోగం
  •  బీఆర్ఎస్‌లో చేరిన మాజీ కౌన్సిలర్ భీమ్ సింగ్
  • నాయకులకు గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన పైలెట్ రోహిత్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ కేంద్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. 3వ వార్డు మాజీ కౌన్సిలర్ భీమ్ సింగ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.భీమ్ సింగ్‌తో పాటు పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీలో చేరడం గమనార్హం. ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు బీఆర్ఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి స్వచ్ఛందంగా నాయకులు ముందుకు వస్తున్నారని తెలిపారు. తమ వార్డులో పట్టున్న నాయకుడు పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వార్డు అభివృద్ధికి మరియు పార్టీ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని భీమ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ముఖ్య నాయకులు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here