టీజెస్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డీపీవో దిష్టిబొమ్మ దగ్ధం – శంకరపట్నం మండల పార్టీ అధ్యక్షులు నెలవేణి రమేష్

ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత మీకు లేదా
అధికారులకు మోరె గణేష్ సూటి ప్రశ్న శంకరపట్నం మండలం అంబేద్కర్ కూడలి వద్ద తెలంగాణ జన సమితి మండల పార్టీ అధ్యక్షులు నెలవేణి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు మోరె గణేష్. జిల్లా అధికార ప్రతినిధి చిట్యాల భానుబాబు.సిపిఐ మండల కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్టల సమ్మయ్య గారు విచ్చేసి మాట్లాడుతూ మొలంగూరు గ్రామ శివారులోని సర్వేనెంబర్ 7O3 గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించారని అందులో రేకుల షెడ్డు కొట్టములు అక్రమంగా నిర్మించారని దాదాపు 8 నెలలుగా తెలంగాణ జన సమితి పార్టీ ఇతర సంఘాలను కలుపుకొని అనేక పోరాటాలు ఉద్యమాలు నిరసనలు నిరాహార దీక్షలు ముట్టడి కార్యక్రమాల ద్వారా నిరసన వ్యక్తం చేయడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ , డిపిఓ ఎమ్మార్వో గార్లను పూర్తి విచారణ చేపట్టి నివేదిక రిపోర్టు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎమ్మార్వో స్పందించి భౌతికంగా తనిఖీ చేసి గుర్తించిన హద్దురాలను అట్టి భూమిని పరిశీలించడం జరిగింది . కానీ జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి దాదాపు 20 రోజులుగా స్పందించ కుండా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం వహించడంతో డిపిఓ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది . ఇకనైనా అధికారి స్పందించనట్లయితే రానున్న రోజుల్లో అన్ని పార్టీలను సంఘాలను కలుపుకొని గూడు లేని నిరుపేదలకు 100 గుడిసెలు వేసి ఇప్పిస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అరకెళ్ల స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి మావునూరు గణేష్ యువజన సమితి జిల్లా అధ్యక్షులు అరికెళ్ల భాను సిపిఐ నాయకులు గోదారి లక్ష్మణ్ పొనగంటి శ్రీనివాస్ రేగుల కుమార్ టీజేఎస్ జిల్లా నాయకులు చిట్యాల భాను ములుగు శ్రీనివాస్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



